Wednesday, 25 June 2014

రాంచరణ్ నివాసంలోకి దూరిన విష సర్పం!

  | Updated: June 25, 2014 17:12 (IST)
రాంచరణ్ నివాసంలోకి దూరిన విష సర్పం!
టాలీవుడ్ నటుడు రాంచరణ్ నివాసంలో అనుకోని అతిధి ప్రత్యక్ష మయ్యాడు. రాంచరణ్ నివాసానికి వచ్చింది మిత్రుడో.. పరిచయమున్న వ్యక్తో అయితే అంత ఇబ్బందేమి ఉండేది కాదు. కాని ఆయన ఇంట్లోకి వచ్చింది  ఓ విష సర్పం.
ఇంట్లోకి పాము దూరిన సంఘటన రాంచరణ్ సిబ్బందికి కొద్దిసేపు ఆందోళన కలిగించింది. అయితే ఆ పామును చంపకుండా వదిలివేయడంపై పలువురు జంతు ప్రేమికులకు ఆనందం కలిగించింది. తన నివాసంలోకి పాము దూరిందని రాంచరణ్ ఫేస్ బుక్ లో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. 
గత రాత్రి ఇంట్లోకి పాము దూరిందని గ్రహించిన రాంచరణ్ సిబ్బంది... పారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆతర్వాత జాగ్రత్తగా ఒడిసిపట్టుకుని.. జంతు సంరక్షణ సొసైటీకి కబురు పెట్టి.. వాళ్లకు అప్పగించారు. సోసైటీకి చెందిన సిబ్బంది పామును అడవిలో వదిలివేసినట్టు తెలిసింది.

No comments:

Post a Comment