హైదరాబాద్: రాష్ట్రంలో మొదటి సారిగా బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో
రూ. 5కే సబ్సీడ్జైడ్ భోజనం, రూ. 3కే టిఫిన్ అందించనున్నట్లు తెలంగాణ నీటి
పారుదల శాఖ మంత్రి టి హరీశ్ రావు వెల్లడించారు. ఎక్సైజ్ శాఖమంత్రి కత్తి
పద్మారావుతో కలిసి మంగళవారం సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌ను
సందర్శించి, రైతులు, హమాలీలు, కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం
ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బోయిన్‌పల్లి మార్కెట్‌ను బాబాసాహెబ్
అంబేద్కర్ మార్కెట్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశామని, అప్పుడే ఈ
మార్కెట్‌ను సందర్శిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పినట్లు తెలిపారు. అందుకే
ఇక్కడికి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా క్యాంటీన్
ద్వారా సరఫరా చేస్తున్న పలహారాలు, భోజనం ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నట్లు
తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. రైతులకు, హమాలీలకు నాణ్యమైన ఆహారాన్ని
అందించాలనే లక్ష్యంతో రూ. 5కే భోజనం, రూ. 3కే అల్పాహారాన్ని అందించాలని
నిశ్చయించినట్లు తెలిపారు. ఈ పథకం అమలుకు అవసరమైన కార్యాచరణను వారంలోగా
రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఈ పథకం సత్ఫలితాలను సాధిస్తే ఇతర మార్కెట్లలో కూడా పథకాన్ని అమలు చేస్తామని
చెప్పారు. చెన్నైలో అమలవుతున్న సబ్సిడీ భోజన పథకాన్ని అధ్యయనం చేసేందుకు
అధికారుల బృందం వెళ్లనున్నదని, అదేవిధంగా ఇప్పటికే ఈ పథకాన్ని అమలు
చేస్తున్న జిహెచ్ఎంసి, హారే రామా సంస్థలతో కూడా అధికారులు చర్చిస్తారని
అన్నారు. సబ్సిడీ భోజనమే కాకుండా మార్కెట్ యార్డులో తాగునీరు, మరుగుదొడ్లు
తదితర వసతులను కల్పిస్తామని చెప్పారు. రైతుల కోసం అన్ని వసతులు కలిగిన
విశ్రాంతి గదులను నిర్మిస్తామని హరీశ్ రావు చెప్పారు.
ఉల్లి గడ్డల ధరలను నియంత్రించడానికి వీలుగా 9 రైతు బజార్లు, 11 మన కూరగాయల
కేంద్రాల్లో రూ. 18కే కిలో ఉల్లిగడ్డలు విక్రయించేందుకు ఏర్పాటు చేశామని
చెప్పారు. ఉల్లి సాగును ప్రొత్సహించే చర్యలు చేపడతామని అన్నారు. మహారాష్ట్ర
రైతులు అవలంభిస్తున్న ప్రక్రియలపై అధ్యయనం చేసేందుకు వీలుగా అధికారుల
బృందాన్ని పంపిస్తున్నామని చెప్పారు. తమది రైతు ప్రభుత్వమని, అన్ని వసతులు
కల్పించి తద్వారా వారి ఆదాయాన్ని పెంచడానికి తగు చర్యలు తీసుంటామన్నారు.
ఇప్పటికే 18వేల కోట్లకు పైగా రైతు రుణాలను మాఫీ చేశామని చెప్పారు.
దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో వెజిటేబుల్ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసేందుకు హార్టీకల్చర్
మార్కెటింగ్ శాఖ అధికారులకు తగు ఆదేశాలిచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో
వ్యవసాయ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషన్ జనార్ధన్ రెడ్డి, అదనపు
కమిషనర్ లక్ష్మీబాయి, మార్కెట్ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ పద్మహర్షా,
స్థానిక డిప్యూటీ ఇంజినీర్ తదితరలు పాల్గొన్నారు.
రూ. 5కే భోజనం: హరీశ్
1/11
మార్కెట్ వద్ద..
రాష్ట్రంలో మొదటి సారిగా బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో రూ. 5కే
సబ్సీడ్జైడ్ భోజనం, రూ. 3కే టిఫిన్ అందించనున్నట్లు తెలంగాణ నీటి పారుదల
శాఖ మంత్రి టి హరీశ్ రావు వెల్లడించారు.
No comments:
Post a Comment