The village which the center point between three districts i.e.,karimnagar,warangal,medhak.
Thursday, 26 June 2014
ఖాళీ అవుతున్న కాంగ్రెస్
హైదరాబాద్, జూన్ 25 (టీ మీడియా): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పార్టీని వీడేందుకు నేతలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీలు ఆమోస్, వీ భూపాల్‌రెడ్డి, ఎస్ జగదీశ్వర్‌రెడ్డి, ఎన్ రాజలింగం, టీ భానుప్రసాదరావు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితో పాటు ఇప్పటివరకు కాంగ్రెస్‌కు మద్దతుతో గెలిచిన ఉపాధ్యయ ఎమ్మెల్సీలు జానార్దన్‌రెడ్డి, పూల రవీందర్ కూడా గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల తరువాత ఎమ్మెల్సీ యాదవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలున్నాయి.సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన జెడ్పీ ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు సమానంగా సీట్లు వచ్చాయి. అలాంటి చోట్ల గెలిచిన జెడ్పీటీసీ సభ్యులు కూడా అధికార పార్టీలోకి చేరుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment